జగన్ విధానాలు నచ్చడంతో వైసీపీలో చేరా: బీద మస్తాన్ రావు

  • ఏ పార్టీలో ఉన్నప్పటికీ అంకిత భావంతో పనిచేస్తా
  • వ్యక్తిగతంగా నాకు శత్రువులు లేరు
  • పార్టీలకతీతంగా నా ప్రాంత అభివృద్ధికి పాటుపడతా
జగన్ విధానాలు నచ్చడం వల్లే వైసీపీ లోకి వచ్చానని బీద మస్తాన్ రావు అన్నారు. టీడీపీ సీనియర్ నేత మస్తాన్ రావు నిన్న పార్టీకి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. ఈ రోజు ఆయన సీఎం జగన్ సమక్షంలో వైసీపీ లో చేరారు. అనంతరం ఆయన మాట్లాడుతూ..సీఎం జగన్ విధానాలు నచ్చే వైసీపీలో చేరినట్లు తెలిపారు.

ఎన్నికల సమయంలో మేనిఫెస్టోలో పేర్కొన్న అంశాలను నెరవేర్చే దిశగా జగన్ అడుగులు వేస్తున్నారని ప్రశంసించారు. తాను ఏ పార్టీలో ఉన్నప్పటికీ అంకిత భావంతో పనిచేసే మనిషినని చెప్పుకొచ్చారు. ఓ కార్యకర్తగా భేషరతుగా వైసీపీలో చేరినట్లు వెల్లడించారు. తనకు వ్యక్తిగతంగా శత్రువులు లేరన్నారు. పార్టీలకు అతీతంగా తన ప్రాంత అభివృద్ధికి పాటుపడతానన్నారు.
Go Back to Shorts
Beeda Masthan Rao
coments on YCP
Jagan policies attracted
Andhra Pradesh

More Telugu News